అతివేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో దేవునిపల్లి గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. కారు అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.