బీజేపీకి తెలంగాణ గేట్ వే ఆఫ్ ఇండియాగా మార బోతోందన్నారు ఆ పార్టీ చీఫ్ రామచందర్ రావు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని గుర్తించి గువ్వల బాలరాజు పార్టీలో చేరారని చెప్పారు.