సంపదను సృష్టిస్తా పేదలకు పంచుతా
NEWS Aug 10,2025 07:55 am
ఐదేళ్లు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఏజెన్సీ ప్రాంతం అంటే దేవుడు సృష్టించిన అద్భుతం అన్నారు. రాష్ట్రంలో సంపదను సృష్టించి పేదలకు పంచాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ ను.. సూపర్ హిట్ చేశారని ప్రశంసించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏపీని ఐటీ, ఫార్మా, లాజిస్టిక్, పర్యాటక హబ్ గా తీర్చి దిద్దుతామని చెప్పారు.