ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి అంతకంతకూ ఎక్కువ అవుతోంది. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 590 అడుగులకు చేరుకుంది. తెల్లవారుజామున మరోసారి రెండు క్రస్ట్ గేట్లు తెరిచారు. ఈ సీజన్ లో సాగర్ గేట్లు తెరుచు కోవడం ఇది రెండోసారి.