కర్ణాటకలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ ప్రారంభిస్తారు. మెట్రో ఫేజ్-3కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బెంగళూరు నుంచి 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మోదీ టూర్ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.