కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ
NEWS Aug 10,2025 07:22 am
కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఇవాళ కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో వరుసగా జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చించనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఇంకా పరిష్కారం కాని కొండా మురళీ సమస్యపై ప్రధానంగా చర్చిస్తారు. కాగా ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై పార్టీ వర్గాలలో ఉత్కంఠ నెలకొంది.