తిరుచానూరు శ్రీప ద్మావతి అమ్మ వారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా స్వర్ణ రథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగు మాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మ వారిని దర్శించుకున్నారు. స్వర్ణ రథోత్సవంలో ఈవో జె. శ్యామల రావు దంపతులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.