కేసీఆర్ కు రాఖీ కట్టిన సోదరీమణులు
NEWS Aug 09,2025 08:07 pm
రాఖీ పండుగ సందర్బంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాఖీలు కట్టారు సోదరీమణులు, పార్టీకి చెందిన మహిళా నాయకురాళ్లు. కేసీఆర్ స్వంత అక్కలు లక్ష్మీ బాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. ఈ సందర్బంగా తన సోదరీమణుల పాదాలు తాకి ఆశీర్వాదం అందుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.