గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు
NEWS Aug 09,2025 07:54 pm
గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణం చేపడతామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. 4.82 లక్షల గిరిజనుల గృహాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామన్నారు. త్వరలోనే సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 4,86,803 మంది గిరిజన విద్యార్థులకు రూ.642 కోట్లు తల్లుల ఖాతాలో వేశామన్నారు.