రాహుల్ ఆరోపణలపై విచారణ జరపాలి
NEWS Aug 09,2025 06:37 pm
ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తన వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారని, 288 సీట్లకు గాను 160 సీట్లను ఫిక్స్ చేద్దామని ఆఫర్ ఇచ్చారని బాంబు పేల్చారు. కానీ తాను ఒప్పు కోలేదన్నారు. ప్రజల వద్దకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా మన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తాజాగా ఈసీపై చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు పవార్.