అడ్డగోలుగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఫైర్
NEWS Aug 09,2025 05:53 pm
రాఖీ పండగ రోజున ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారంటూ ఆర్టీసీపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చికెన్ రేట్ల తరహా ఆర్టీసీ ఛార్జీలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియడం లేదని వాపోయారు.జేబీఎస్ నుండి కరీంనగర్‌కు రూ.160, నాగర్ కర్నూల్ నుండి హైదరాబాద్‌కు రూ.100, నాగర్ కర్నూల్ నుండి కొల్లాపూర్‌కు రూ.30, కల్వకుర్తి నుండి హైదరాబాద్‌కు రూ.50 టికెట్ ఛార్జీలు పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.