టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. భూకబ్జాలో కేసీఆర్ కుటుంబం ఎక్స్‌పర్ట్ అంటూ మండిపడ్డారు. మీ దగ్గరే అన్ని లోపాలు పెట్టుకుని కాంగ్రెస్‌ని ఎందుకంటారని ప్రశ్నించచారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ చేసిన మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ముందు మీ ఫ్యామిలీని చక్క దిద్దుకుని ఇతరుల గురించి మాట్లాడాలని హితవు పలికారు. తాము ప్రజా పాలన అందిస్తున్నామని చెప్పారు.