క్రిక్కిరిసిన తిరుమల పుణ్యక్షేత్రం
NEWS Aug 09,2025 08:15 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 70 వేల 480 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 923 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.17 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.