కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకుంది. తనపై చేసిన అనుచిత కామెంట్స్ పై 48 గంటల్లో సారీ చెప్పాలని లేక పోతే లీగల్ నోటీసులు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్ బండికి. దీనిపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సంజయ్. తను లీగల్ నోటీసుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.