సహాయక చర్యలు చేపట్టండి - సీఎం
NEWS Aug 09,2025 07:25 am
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు, వరద సమస్యలపై సమీక్ష చేపట్టారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండటం వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు తెలిపారు. వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం.