మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ చేయాల్సింది పోయి మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ . సిట్ అధికారులకు ఆధారాలు సమర్పించే సమయంలో నేనే షాక్ కి గురయ్యానని అన్నారు. కేవలం నా ఒక్కడి ఫోనే అనేక సార్లు ట్యాప్ చేశారని వాపోయారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో హరీష్ రావు, కవిత కూడా ఉన్నారని బాంబు పేల్చారు. వావీవరసలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.