గత ఎన్నికల్లో ఈసీ బీజేపీ గెలుపొందేందుకు తోడ్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఓట్ల అవకతవకలతోనే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో గెలిచిందంటూ బెంగళూరులో ధర్నా చేపట్టారు. మేం ప్రశ్నిస్తుంటే ఈసీ వెబ్ సైట్ మూసివేసిందని ఆరోపించారు. మహారాష్ట్రలో కోటి కొత్త ఓటర్లు నమోదయ్యాయని, కర్ణాటకలో కూడా ఫేక్ ఓట్లు నమోదయ్యాయని మండిపడ్డారు. ఒకే ఇంట్లో 40కి పైగా ఓట్లు ఉన్నాయని దీనిపై విచారణ జరిపించాలన్నారు.