ఏపీఎస్ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. తిరుమల ఘాట్ రోడ్డులో రాకపోకలు సాగించే బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండదని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకం వర్తించదన్నారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం అమలు కానుందని తెలిపారు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్, ఓటర్ కార్డుల ద్వారా ఫ్రీగా జర్నీ చేయొచ్చన్నారు.