భారీగా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ జలాశయంలోకి ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో గేటు ఎత్తి 339 క్యూసెక్కుల నీళ్లను మూసీ నదిలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు పూర్తి సామర్థ్యంతో నిండి పోయాయని ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో వరద నిర్వహణ ప్రయత్నాలను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.