మల్లన్న సన్నిధిలో వరలక్ష్మి వ్రతం
NEWS Aug 08,2025 08:37 am
శ్రీశైలంలోని మల్లన్న ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా 1600 మంది మహిళలతో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో మహిళలతో సామూహిక వరలక్ష్మి వ్రతం జరిపించారు అర్చకులు. మహిళలకు పూజ సామగ్రి ఉచితంగా అందజేసింది దేవస్థానం. వరలక్ష్మి వ్రతం అనంతరం మహిళలకు శ్రీస్వామి, అమ్మవారి దర్శనం కల్పించింది.