బనకచర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటు
NEWS Aug 08,2025 08:30 am
బనకచర్ల ప్రాజెక్టుపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురి చొప్పున పేర్లు పంపించాలని కోరింది కేంద్ర జలవనరుల శాఖ. ఇరు రాష్ట్రాల నుంచి పది మందిని ఎంపిక చేస్తామని తెలిపింది. కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణులకు కమిటీలో చోటు కల్పిస్తామని పేర్కొంది.