ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించడం లేదు
NEWS Aug 08,2025 08:23 am
ప్రభుత్వాన్ని మాజీ సీఎం కేసీఆర్ సరిగ్గా ప్రశ్నించడం లేదంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. సమస్యలపై బీఆర్ఎస్ అగ్రనేతలు పోరాటం చేయట్లేదదని ఆరోపించారు. ప్రజల ఎజెండాగా ముందుకెళ్లాలని ఎన్నోసార్లు చెప్పినా పట్టంచు కోలేదన్నారు. కవిత వ్యవహారంతో అందరూ గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. తన పొలిటికల్ కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. కేసీఆర్ చెప్పిందే తూచా తప్పకుండా పాటించానని,, తనను ఏ పార్టీ నన్ను కొనుగోలు చేసే ప్రయత్నం చేయలేదన్నారు.