ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈసీ కౌంటర్ ఇచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. అక్రమాలు జరిగాయని భావించినా, లేక అనుమానాలు ఉన్నా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చని తెలిపింది ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తే ఆధారాలు చూపించాలని కోరింది. ఎన్నికల అక్రమాలపై అనుమానాలు ఉంటే లిఖిత పూర్వక ఫిర్యాదు చేయాలని సూచించింది.