తిరుమల క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 65 వేల 234 మంది దర్శించుకున్నారు. 26 వేల 133 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం నారాయణ గిరి షెడ్స్ వరకు క్యూ లైన్ ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.