నగరాన్ని ముంచెత్తిన వాన
NEWS Aug 07,2025 08:46 pm
హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. రహదారులన్నీ నీట మునిగాయి. గంటకు పైగా దంచి కొట్టింది వర్షం. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ వర్షపాతం కురిసింది. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల కొద్దీ వాహనాలు చిక్కుకు పోయాయి. ప్రజలు బయటకు రావద్దంటూ హెచ్చరించింది జీహెచ్ఎంసీ.