బీహార్ లో ఓట్ల తొలగింపుపై ఈ సీ మౌనమేల..?
NEWS Aug 07,2025 02:51 pm
కేంద్ర ఎన్నికల సంఘంపై సీరియస్ అయ్యారు ఎంపీ రాహుల్ గాంధీ. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకే అనుకూలంగా ఫలితాలు ఎలా వస్తాయన్నారు. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కు పూర్తి భిన్నంగా ఫలితాలు వస్తుండడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశామన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయన్నారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారని, దీనిపై ఈసీ సమాధానం చెప్పాలన్నారు.