టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్ కు రూ. 1 కోటి విరాళం
NEWS Aug 07,2025 10:54 am
టీటీడీ ప్రాణదానం ట్రస్ట్ కు భారీ విరాళం అందజేశారు సీకేపీసీ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిరాగ్ పురుషోత్తం. మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు ను కలిసి చెక్కును అందజేశారు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ద్వారా ఎందరో పేద ప్రజలకు వైద్య సహాయం అందజేసి ప్రాణ రక్షణను టీటీడీ చేస్తోంది . గుండె, మూత్ర పిండాలు, మెదడు మొదలైన ప్రాణాంతక వ్యాధులతో బాధ పడుతున్నపేద రోగులకు ఉచిత వైద్యం అందించాలనే గొప్ప లక్ష్యంతో పని చేస్తోంది.