తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Aug 07,2025 10:47 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 71 వేల 144 మంది దర్శించుకున్నారు. 28 వేల 889 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.15 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.