మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. అది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదని, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆరోపణల చిట్టా అంటూ ఎద్దేవా చేశారు. బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని పండ బెడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కేసీఆర్‌ను బద్నాం చేసే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే తప్పా మరోటి కాదన్నారు. ఇచ్చిన హామీల నుండి తప్పించు కునేందుకే జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ వేషాలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు.