అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ షాక్ ఇచ్చారు ఇండియాకు. భారత్ పై మరో 25 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 25 శాతం సుంకాలను విధించారు. దీంతో సుంకాలు 50 శాతానికి పెరిగాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.