బీజేపీలో చేరడం లేదు - గువ్వల
NEWS Aug 05,2025 11:39 am
కేసీఆర్ ఫ్యామిలీ కొంత బాధలో ఉందని, ఈ సమయంలో తను బాధ పెట్టాలని అనుకోవడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బీఆర్‌ఎస్‌కు రెండ్రోజుల క్రితమే రాజీనామా చేశానని అన్నారు. బీజేపీలో చేరుతానని కావాలనే ప్రచారం చేస్తున్నారని, తాను చేరాలని అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపు వచ్చిందని, సీఎం కూడా తమ నియోజకవర్గానికి చెందిన వాడేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.