ఏపీలో ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు సీఎం చంద్రబాబు. దర్శి మండలంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. మొదటి విడతలో రైతుల ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2342.92 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు.