కొడుకు పీటీఎంకు హాజరైన మంత్రి లోకేశ్
NEWS Aug 02,2025 01:04 pm
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు నారా దేవాంశ్ చదువుతున్న స్కూల్‌కు వెళ్లారు. పాఠశాలలో నిర్వహించిన పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) హాజరయ్యారు. అర్ధాంగి బ్రాహ్మణితో కలిసి వెళ్లిన ఫొటోను ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. తన అధికారిక విధులకు విరామం ఇచ్చి మరీ తన కుమారుడి పాఠశాలకు వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. ఒక తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించడంతో పాటు, విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో చాటిచెప్పడానికే తాను ఈ సమావేశానికి హాజరైనట్లు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.