శ్రీవారిని దర్శించుకున్న నితిన్ గడ్కరీ
NEWS Aug 02,2025 11:27 am
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన కుటుంబ సమేతంగా తిరుమలను సందర్శించారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు ఏఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి. ఆలయ పూజారులు గడ్కరీకి ఆశీర్వచనాలు అందజేశారు. మంత్రికి శ్రీవారి ఫోటో, తీర్థ ప్రసాదాలను అందజేశారు.