పార్టీ ఫిరాయింపులపై స్పందించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించిందే బీఆర్ఎస్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని ఆరోపించారు.. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు ఆ పార్టీకి లేదన్నారు.