బనకచర్లకు మద్దతు ఇవ్వాలి
NEWS Aug 01,2025 03:23 pm
తెలుగు ప్రజల హక్కుల కోసం TDP నిలబడుతుందని అన్నారు మంత్రి లోకేష్. కేంద్రం అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ కాళేశ్వరం నిర్మాణం చేపట్టిందన్నారు. అయినా మేం కేంద్రానికి లేఖలు రాయలేదన్నారు. కాళేశ్వరం వల్ల తెలుగు ప్రజలకే లాభమని, మరి బనకచర్లకు ఎందుకు వర్తించ కూడదని ప్రశ్నించారు. వృధాగా సముద్రంలో కలిసే నీటిలో స్వల్ప భాగమే బనకచర్ల కోసం వాడుకుంటామన్నారు. బనకచర్ల కోసం ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కరారు.