మా నీటి వాటా కోసం నిలదీస్తాం
NEWS Aug 01,2025 03:07 pm
గోదావరి నీళ్లను బరా బర్ తీసుకు పోతామంటూ కామెంట్స్ చేసిన మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. మా నీళ్లు మాకు కావాలని మాట్లాడేతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టా అని ప్రశ్నించారు. మా ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. తెలంగాణ సాధించిన పార్టీగా మాకు దక్కాల్సిన నీటి వాటాపై తప్పకుండా మాట్లాడతామని, గిరిగీసి కొట్లాడుతామని వార్నింగ్ ఇచ్చారు.