ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది కేవలం 47 లక్షల మంది రైతులేనని, మరి మిగతా వారి పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు.హామీలు ఇచ్చే ముందు కేంద్రం వాటాతో కలిపి అని ఎందుకు చెప్పలేదని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.