టీచర్లు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు
NEWS Aug 01,2025 06:19 pm
ప్రభుత్వ విద్యాసంస్థల్లోని టీచర్లకు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం ప్రకారం నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు తమ చరవాణిలో ఫోటో అప్‌లోడ్ చేసుకుని ప్రధానోపాధ్యాయులు లాగిన్‌లో వివరాలు నమోదు చేసుకున్నారు. తరువాత ఉపాధ్యాయులు తమ ఫోటో ఆధారంగా ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేసుకున్నారు. నెట్ లేని ప్రాంతంలో ఉపాధ్యాయులు సమస్యలను ఎదుర్కొన్నారు, మెట్‌పల్లి చావిడి వద్ద గల నూతన ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తమ చరవాణిలో హాజరు నమోదు చేసుకున్నారు.