నటి కల్పికపై తండ్రి ఫిర్యాదు
NEWS Aug 01,2025 09:48 am
తన కూతురు నటి కల్పిక మానసిక రుగ్మతతో బాధ పడుతోందని అన్నారు తండ్రి సంఘ్వర్ గణేష్. తనకు, కుటుంబానికి, ప్రజలకు ప్రమాదకరంగా మారిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తను ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిపారు.మందులు ఆపివేసిన తర్వాత రెండేళ్లుగా నిరాశకు గురైందని, అందుకే తరచుగా గొడవపడి ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు . తన కూతురిని పునరావాస కేంద్రానికి తిరిగి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.