కడపః జమ్మలమడుగులో నేడు చంద్రబాబు టూర్
NEWS Aug 01,2025 09:36 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, గండికోటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.