మోహన్ బాబు, విష్ణులకు కోర్టులో ఊరట
NEWS Aug 01,2025 07:45 am
సినీ నటులు మోహన్ బాబు, విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన విషయంలో నమోదైన ఎఫ్ఐఆర్ క్వాష్ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేపట్టడంతో కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు మోహన్ బాబు, విష్ణుకు షాక్ ఇచ్చింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు తండ్రీకొడుకులు. విచారించిన కోర్టు ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయడంతో తాత్కాలికంగా అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు.