మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు ఎంపీ రాహుల్ గాంధీపై. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మౌనంగా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. చేతిలో రాజ్యాంగం పట్టుకునేది కేవలం రాజాకీయ లబ్ధి కోసమేనా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై ఎందుకు స్పందించ లేదంటూ నిలదీశారు. మీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారం నడుచుకోమని తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు.