మంత్రి నారా లోకేష్ కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకున్నారు. కాళేశ్వరం ఎందుకు కట్టారంటూ ప్రశ్నించచారు. రెగ్యులేటరీ పర్మిషన్ ఉందా అంటూ నిలదీశారు.సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను లిఫ్ట్ చేసి బనకచర్ల కడితే తప్పేంటి అన్నారు. రాజకీయ లబ్ది కోసం కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు వచ్చే పెట్టుబడులను మేం ఏనాడైనా అడ్డుకున్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడున్నా తెలుగు ప్రజలు నెంబర్ వన్ గా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.