ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కి బిగ్ షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదైంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఏపీ ప్రభుత్వం.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేసింది. మూడు వారాల్లో లొంగి పోవాలని సంజయ్ ని ఆదేశించింది.