శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.99 కోట్లు
NEWS Jul 31,2025 10:49 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 75 వేల 303 మంది భక్తులు దర్శించుకున్నారు. 27 వేల 166 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.99 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.