క్వార్ట్జ్ వ్యాపారాన్ని మూసేస్తున్నా - ఎంపీ
NEWS Jul 31,2025 07:55 am
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. క్వార్ట్జ్ వ్యాపారాన్ని మూసేస్తున్నానని అన్నారు. ఫిని క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్ పేరుతో రెండు కంపెనీలు పెట్టానని, 1000 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలని అనుకుంటే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ వాపోయరు. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఫ్యాక్టరీ పెడితే వారికి సాయం చేస్తానని అన్నారు. రాబోయే ఇండ్ సోల్ కంపెనీకి ఈ క్వార్ట్జ్ ముడిసరుకు అవసరం ఉందన్నారు. ఎక్కడా తాను అక్రమంగా వ్యాపారాలు చేయడం లేదన్నారు.