బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు రూ. 25 కోట్లు
NEWS Jul 31,2025 07:48 am
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ విషయంలో కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు . హైదరాబాద్ గౌలిదొడ్డిలోని బ్రాహ్మణ సదనంలో సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్స్ లెన్స్(సీబీఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. సంస్థ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇస్తామన్నారు.