భారత్ కు ట్రంప్ షాక్ 25 శాతం టారిఫ్
NEWS Jul 31,2025 07:45 am
భారత్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమలులోకి వస్తాయన్నారు. సుంకాలతో పాటు పెనాల్టీ కూడా ఉంటుందన్నారు. రష్యా నుంచి భారీగా భారత్ ఆయుధాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు. భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొనడంపై అభ్యంతరం తెలిపారు. భారత్ మిత్ర దేశమే అయినా టారిఫ్ తప్పదన్నారు.