కవితకు దీక్ష చేసే అర్హత లేదు..
కాంగ్రెస్ నేత ఇందిరాశోభన్ ఫైర్
NEWS Jul 31,2025 07:38 am
BRS ఎమ్మెల్సీ కవితకు దీక్ష చేసే అర్హతే లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభన్. అధికారంలో ఉన్నప్పుడు కనీసం బీసీల ఊసెత్తని కవిత.. ఇప్పుడు ఏకంగా దీక్షకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు. కవితకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, వెళ్లి ఢిల్లీలో దీక్షచేయాలన్నారు. అసలు ఆమె దీక్ష చేసేది అన్న కేటీఆర్‌పై ఆధిపత్యం కోసమే తప్ప.. బీసీలపై ప్రేమతో కాదన్నారు. తమ నాయకుడు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ , పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో బీసీల రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో తాడోపేడో తేల్చుకుంటామన్నారు.